August 18, 2011

వేయి వసంతాల సేన

అస్పష్టమైన ద్రుశ్యాలను, స్పష్టం చేస్తూ,

 రాత్రిని ఆక్రమించిన నల్లని పొరను తొలగిస్తూ,

నిన్నటి అసంపూర్ణ చిత్రాన్ని,
పూర్తి చేసెందుకు మరో అవకాశాన్నిస్తూ,
 
నిరంతర గమనంలో అలసిన జీవులకు నూతన శక్తినిస్తూ,
 
కలల కల్లోలంతో కలత చెందిన "మనిషి"కి కొత్త ఆశలనుఅందిస్తూ,
 
వేయి వసంతాల సేన లా ,
 
మన ముందుకొస్తుంది,
 
ఉదయం...

No comments:

Post a Comment