రాత్రి కురిసిన వెన్నెల్లో, తడిసిన మల్లెలు,
వేకువ వెలుగులో వెన్నముద్దల్లా కనిపిస్తున్నాయి...
రేయిపై చీకటి దుప్పటి కప్పిన, రొజు,
పగటిపై వెలుగుపొరను పరిచేందుకు సన్నద్దమవుతుంది...
నిన్నటి నిరాశలతో వాడిన మానవ కుసుమాలు,
నేటి తాజా ఆశలతో వికసించేందుకు సిద్దమవుతున్నయి...
మరో,
అపురూపమైన ఆనందం మనకు అందేందుకు సిద్దంగా వుంది,
ఇక,
మనదే ఆలస్యం....
No comments:
Post a Comment