September 07, 2011

రెప్పవాల్చని అందం...

రాత్రంతా,
చీకటి పరదా వెనుక,
ప్రకృతి తన్మయత్వంతో,
చిత్రించిన చిత్రపు సొగసులు,

పరదా జారుతున్నకొద్దీ,
బహిర్గతమవుతూ,
తమ అందాలతో,
నింగి రెప్ప,
వాలకుండా చేస్తున్నాయి.

వాలిన రెప్పలు విరిసేందుకు,
స్పూర్తిగా నిలుస్తున్నాయి...

2 comments:

  1. 'శుభోదయం' గురించి ఇన్ని రకాల తలపులని ఇన్ని రంగుల్లో చిత్రించాలన్న మీ ఆలోచన భలే ఉందండీ..! Very interesting! :)

    ReplyDelete