September 05, 2011

దరి చేరిన ఉదయం...

నల్లని నేలపై,
తెల్లని పాల వర్షం కురిసినట్టుగా,
వెల్లువై వచ్చిన వెలుగు,

చీకటిని,
కొండ చిలువలా, అమాంతం మింగేసింది.

ఆగే అలవాటు లేనట్టుగా,
ఉదయం,
వెలుతురు జల్లులను కురిపిస్తుంది.

జారిపోయిందేమో!
అనుకున్న పగలు,
మళ్లీ,
మన దరికి చేరింది...

No comments:

Post a Comment