Showing posts with label నేటి ఉదయం. Show all posts
Showing posts with label నేటి ఉదయం. Show all posts

February 22, 2012

వెలుగుల పంట...

అవనిని అభిషేకించేందుకే అన్నట్టుగా,
వెలుగుముత్యాలు,
వేలకొద్దీ నేలజారుతున్నాయి.
వాటిలో,
ఏ ముత్యం దయవల్లో కానీ,
మన పరిసరాలు కూడా వెలుగులో నిండిపోయాయి.

మెల్లగా కనులు తెరిస్తే చాలు,
మిమ్మల్ని కూడా ఆ వెలుగుల పంట పలకరిస్తుంది...

February 08, 2012

మనోహరమైన ఉదయం

అందాన్ని ఆనందం,
సౌందర్యాన్ని సంతోషం ముద్దాడిన,
అపురూపమైన అనుభూతిని,
మనకు అందిస్తున్న,
మనోహరమైన ఉదయానికి,
మనస్పూర్తిగా స్వాగతం చెప్పేదాం మరి.

February 01, 2012

కదలివచ్చిన ఉదయం

సవ్యమైన శ్వాస గమనానికి,
ఉచ్వాస నిశ్వాసలు ఎంత అవసరమో,

రోజు గమనానికి రేయీ పగలూ అంతే అవసరం.

అటువంటి రోజు కదలికలో,
కదిలిపొయిన ఒక రాత్రి,
సహకారంతో,
మరో పగలు కదలివస్తుంది...

September 06, 2011

మంచి ముత్యం వంటి ఉదయం...




వాడిపోని భందాలూ,
వీడిపోని స్నేహాలూ,
మరి కొంత సేపు ,
కొనసాగించేందుకు,
అవకాశాన్నిస్తున్న,

ఈ ఉదయపు హ్రుదయం,

మంచి ముత్యపు రంగులో మెరిసిపోతుంది...



September 04, 2011

వర్షించిన ఉదయం..

కొండమల్లెల సమూహం,
రాత్రి వెలువరించిన సుగంధం,

చీకటి మనసును సైతం కరిగించి,

వెలుగై,
మనపై,
కురిసేటట్లు,
చేస్తుంది...


September 03, 2011

రాజ యోగం...

వెలుతురుగా మారుతున్న చీకటిలో,
చిలక పలుకు వంటి,
అస్పష్ట ద్రుస్యం,
మైనా మాట లా మారుతున్నది.

కష్టంగా గడచిన క్షణాలు,
ఇష్టంగా కదులుతున్నాయి.

ఎందుకటే,
"రాజ యోగం" వంటి ఉదయం, మొదలవుతుంది.
మన శ్వాసకు ,
కొత్త విశ్వాసాన్ని అందిస్తూ...

August 29, 2011

రవి కిరణపు గమనం...




శబ్దరహిత ప్రక్రుతిలో సవ్వడి మొదలైంది.

మానస సరోవరమున కదలాడుతున్న,
మానస జీవుల చలనం,
ఆగిపోయింది.

ఎందుకంటే,

రవి కిరణపు గమనంమొదలైంది,
భువిని చేరేందుకు..




August 23, 2011

నేటి ఉదయం


ఫట్టు వస్త్రం వలే,
తెల్లని వెలుగుతో,
ఛల్లని చూపుతో,

పండిన ఆకు,
నేలను చేరినంత నిశ్శబ్దంగా,
మనల్ని చెరుకుంది
"నేటి ఉదయం"...